పసుపు రైతులను ఆదుకోవాలి.

Turmeric

పసుపు రైతులను ఆదుకోవాలి..
రైతు ఐక్యవేదిక నాయకుల డిమాండ్
మల్లాపూర్ మార్చి 06 నేటి దాత్రి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుపేడ్ ద్వారా పసుపు ను15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు గురువారం రోజున మల్లాపూర్ మండల కేంద్రంతోపాటు కొత్త ధాం రాజ్ పల్లి గ్రామాల్లోని రైతులను కలిసి మార్చి 11వ తేదీన చేపట్టబోయే మహాధర్న కార్యక్రమం గురించి చర్చించారు.ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే సీజన్లో 16 వేల నుండి 18 వేల రూపాయలు వరకు పసుపు ధర పలికిందని ఈ సంవత్సరము ఎనిమిది వేల నుండి పదకొండు వేలు వరకు ధర పలుకుతుంది గత సంవత్సరానికి ఇప్పటికి సగానికి సగం ధర పడిపోవడం జరిగిందన్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా కొనుగోలు చేశారో ఆ విధంగా కొనుగోలు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు, రైతులు డిమాండ్ చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు.. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నల్ల రమేష్ రెడ్డి,రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, రైతు ఐక్యవేదిక మండల అధ్యక్షులు డబ్బా రమేష్ రెడ్డి, రైతు నాయకులు కాటి పల్లి గంగా రెడ్డి, తురుక. శ్రీధర్ రెడ్డి, బందేలా. మల్లయ్య
కొమ్ముల సంతోష్, కాటిపల్లి ఆదిరెడ్డి, మామిడి రాజశేఖర్ రెడ్డి, పుండ్ర శ్రీనివాస్, కళ్ళెం మహిపాల్,సుధాకర్ రెడ్డి ,తిరుపతి రెడ్డి , ఎన్టీఆర్,బద్దం కమలాకర్, లింబా రెడ్డి, భూమా రెడ్డి,సత్యనారాయణ , గంగరాజాం,శ్రీనివాస్ రెడ్డి , లచ్చయ్య,గంగా రెడ్డి,వినోద్ రెడ్డి,హరీష్,రాజేందర్,,రైతులు,రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!