బోయినిపల్లి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన మంచాల రమేష్ గురువారం అనారోగ్య సమస్యలతో మరణించరు.
వారిది అత్యంత నీరుపేద కుటుంబం కనీసం నివసించడానికి ఇల్లు కూడా లేదు .వారి యొక్క దయనీయ స్థితిని తడగొండ తూడి లచ్చన్న యువసేన సభ్యుల ద్వారా లచ్చన్న కి విషయం తెలిపారు.స్పందించిన
లచ్చన్న యువసేన సభ్యులు వచ్చి మృతుని భార్య లత కూతురు సాత్విక లను పరామర్శించి తక్షణ సహాయం 5000 రూ,,అందించడం జరిగింది.మృతుని కుటుంబంతో తూడి లచ్చన్న చరవాణి ద్వారా మాట్లాడారు
మీరు అదైర్య పడకండి నేను మీ కుటుంబాన్ని నేరుగా కలిసి ఆదుకుంటానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం తుడి లచ్చన్న యువసేన సభ్యులు యువకులు పాల్గొన్నారు.