LED Tube Lights Donated to School Hostel
వసతి గృహం విద్యార్థులకు ట్యూబ్ లైట్స్ అందజేత
మంచిర్యాల,నేటి ధాత్రి:
బెల్లంపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకస్మికంగా పర్యటించగా అక్కడ ఉన్న వసతి గృహంలో సరైన వెలుతురు లేక చీకటి అలుముకున్న దృశ్యాలను చూసి వారు చలించి పోయారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలసి వసతి గృహంలో సరైన వెలుతురు,కాంతి ఎందుకు లేవని అడిగారు.దానికి ప్రధాన ఉపాధ్యాయులు గతంలో ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు అవి పూర్తిగా చెడిపోయాయి అని అన్నారు.ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు అందకపోవడంతో అభివృద్ధిలో లోటు ఏర్పడిందని తెలిపారు.7వ తరగతి చదువుతున్న బి.అశ్విత్ తండ్రి మల్లేష్ మంచి మనసుతో వెంటనే స్పందించి పాఠశాల విద్యార్థుల అభివృద్ధికై తమ వంతు సహాయముగా 30 ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ కొనుగోలు చేసి పాఠశాలకు అందజేశారు.పేరెంట్స్ కమిటీ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ సాగర్,పేరెంట్స్,విద్య కమిటీ చైర్మన్ రాజేశ్వర్,ఉపాధ్యాయులు కొండలరావు,గోపి పాల్గొన్నారు.
