లీడర్లను కాదు క్యాడర్‌ నమ్మండి!

https://epaper.netidhatri.com/

`బిఆర్‌ఎస్‌ సైనికులకు సముచిత స్థానం ఇవ్వండి.

`క్యాడర్‌ అభిప్రాయాలు వినండి.

`వారికి మరింత ప్రాధాన్యత కల్పించండి.

`పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునేది క్యాడరే.

`గులాబీ జెండా చేతిలో పట్డుకునేది క్యాడరే.

`కండువా కూడా బరువు అనుకునే వారిని పక్కన పెట్టండి.

`పక్క చూపులు చూసే వారిని పసిగట్టండి.

`ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణం చేపట్టండి.

`క్యాడర్‌కు పదవులు పంచండి.

`సీనియర్లను పరిశీలకులుగా మార్చండి.

`నాయకులు పెత్తనం మాని, ప్రేమగా మాట్లాడం నేర్చుకోండి.

`అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించండి.

`మరో వందేళ్లు మళ్ళీ పునాదులు వేయండి.

`క్యాడర్‌ త్యాగాలే లీడర్ల పదవులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అంతర్మధనం ఎప్పుడైనా మంచిదే. ఎప్పటికీ మేలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు జయాలు, పరాయజయాలు సహజం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఎంత గొప్ప పరిపాలన అయినా సరే ఓటమి చెందడం సహజం. రాజకీయ పార్టీలు చేసే కొన్ని ప్రచారాలు కూడా ప్రజలను మాయ చేస్తుంటాయి. మభ్యపెడుతుంటాయి. గతంలో గొప్ప గొప్ప పాలకులు కూడా ఓడిన సందర్భాలున్నాయి. ఓటమిని ఎదుర్కొన్న దాఖలాలు అనేకం వున్నాయి. ఎన్టీఆర్‌ హాయాంలో ఇదే కాంగ్రెస్‌ పార్టీ సినిమాలు నిర్మించింది. ఆనాడు సోషల్‌ మీడియా లేదు. కాని సినిమారంగం ప్రభావం బాగా వుండేది. ప్రజలపై సినిమాల ప్రభావం విపతీతంగా వుండేది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నటుడు ఘట్టమనేని కృష్ణ పని గట్టుకొని కొన్ని సినిమాలు తీశాడు. అదే సమయంలో మండలాదీషుడు, గండిపేట రహస్యం. నా పిలుపే ప్రభంజనం. అంటూ కొన్ని సినిమాలు నిర్మించారు. ప్రజల్లో అపోహలు సృష్టించారు. అదే నటుడు కృష్ణ అనేక సార్లు ఎన్టీఆర్‌ ఎంతో నిజాయితీ పరుడు అంటూ కితాబిచ్చారు. ఒక ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసి, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్న పార్టీని ఓడిరచి, తర్వాత ఆయన మంచి నాయకుడు. ఆ పార్టీ గొప్పది అని చెప్పుకుంటే ఏం లాభం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒకప్పుడు పివి. నర్సింహారావు ప్రధానిగా వున్నప్పుడు జేఎంఎం ముడుపులు కేసు అంటూ పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంపిలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు అన్నారు. సంస్కరణలు తెచ్చి, దేశం పరువు తీశాడని అన్నారు. అంతర్జాతీయ విఫణిలో దేశాన్ని నిలబెట్టాడని అన్నారు. విదేశీ పెట్టుబడులకు ద్వరాలు తెరిచాడని ప్రచారం చేశారు. మన దేశాన్ని ఇతర దేశాలకు రుణ గ్రస్ధ దేశంగా మార్చుతున్నాడని ప్రచారం చేసి, ఆయన ప్రభను మసక చేశారు. చివరికి ఆయన చనిపోయినప్పుడు కూడా పార్ధీవ దేహానికి సముచిత గౌరవం ఇవ్వలేదు. కాని ఇప్పుడు పివిని దేశమంతా కొనియాడుతోంది. కాంగ్రెస్‌ కూడా దేశం ఈ రోజలు ఈ స్ధాయిలో వుందని చెప్పడానికి ఎంతో గర్వంగా వుందని అది కాంగ్రెస్‌ ప్రభుత్వ గొప్పదనమని చెప్పుకుంటోంది.
అలాగే పదేళ్ల కేసిఆర్‌ పాలనపై ప్రతిపక్షాలు కూడగట్టుకొని అసత్యాలను విపరీత ప్రచారం చేశారు.
విష ప్రచారం విసృతంగా చేశారు. ఇప్పుడు సినిమాల ప్రభావం తగ్గి, సోషల్‌ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. దానికి తోడు మీడియా కూడా బిఆర్‌ఎస్‌ ఓటమి కోసం చేయాల్సినంత చేశాయి. ఇలా రెండు రకాల మీడియా ప్రభావం బిఆర్‌ఎస్‌ ఓటమికి కారణలాలయ్యాయి. కేసిఆర్‌ ప్రజలను కలవడంటూ, ప్రజలంటే చులనక అంటూ ప్రచారం చేశారు. అలా ప్రతిపక్షాలు విరుచుకుపుడుతుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు మైనం పాటించారు. తాము కూడా అసంతృప్తిగా వున్నట్లు ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు బిఆర్‌ఎస్‌నేతలు కూడా కొంత మంది పంపించారు. అంతే కాకుండా నిత్యం నియోజకవర్గాలో ఓ స్దాయి నాయకులు కీచులాడుకోవడం వంటికి కూడా పార్టీకి తీరని నష్టంచేశాయి. అయితే లీడర్లు కూడా పార్టీ భ్రష్టు పట్టిండచంలో ఆరితేరిపోయారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాయకులు సమావేశంలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఈ సంగతి గతంలో తెలియంది కాదు. అధికారంలో వున్నప్పుడు తప్పులు పొరపాట్లు ఎక్కడా కనిపించవు. ఒక వేళ ఎవరైనా తప్పు జరుగుతుందని తెలిపిన వారినే గిద్దిస్తారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ వారిని పార్టీకి దూరం చేస్తారు. అంతే కాని పార్టీలో ఏం జరుగుతుందని ఏనాడైనా కార్యకర్తలను పిలిచి అడిగారా? లేదు. పదేళ్ల కాలంలో ఏనాడు కార్యకర్తలతో అటు పార్టీ అధినేత కేసిఆర్‌ కాని, అగ్రనేతలు కేటిఆర్‌, కవితలుగాని సమావేశమైంది లేదు. ఎంత సేపు లీడర్లతో మంతనాలు..వారితో సమావేశాలు. అయినా కనీసం వారి మాటలైనా విన్నట్లు కూడా ఎక్కడా విన్నది లేదు. వార్తలు వచ్చింది లేదు. రాష్ట్ర స్ధాయిలో మోనో పలి, జిల్లా స్ధాయిలో ఓ స్ధాయి నాయకుల తీరు అంతా కలిసి పార్టీని నిండా ముంచాయి. మరో వైపు ఓ స్ధాయి నాయకులు పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా సంపాదించారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా వారిని వారించిన దాఖలాలు లేవు. వారికి హెచ్చరికలు జారీ చేసింది లేదు. దాంతో అడ్డూ అదుపు లేకుండా నాయకులు సంపాదించుకున్నారు. కార్యకర్తలకు అందాల్సిన వాటిని కూడా నాయకులే ఎత్తుకెళ్లారు. క్యారడ్‌ ఎప్పుడూ నాయకుల వెంట తిరగడం తప్ప వారికి మిగిలిందేమీ లేదు. వారికి ఒరిగిందేమీ లేదు. సంపాదించుకున్నది లేదు. కాలం వృధా అయ్యింది. వయసు తరిగిపోయింది. అయినా ఎవరూ పెద్దగా కనికరించిందిలేదు. ఇప్పటికైనా క్యాడర్‌ను అదరించండి. వారికి ఓ దారి చూపండి. నాయకులుగా వారిని గుర్తించండి. అంతకన్నా పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదు.
లీడర్లను కాదు క్యాడర్‌ను నమ్మండి. బిఆర్‌ఎస్‌ సైనికులకు సముచిత స్ధానం ఇవ్వండి.
క్యాడర్‌ అభిప్రాయాలు స్వీకరించండి. వారికి తగిన ప్రాదాన్యత కల్పించండి. పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునేది క్యాడరే. పార్టీని కాపాడుకునేది క్యాడరే. గులాబీ జెండా భుజం దించకుండా మోసేది క్యాడరే. కండువా కూడా బరువు అనుకునే నాయకులెవరో తెలుసుకోండి. పక్క చూపులు చూసే వారిని పసిగట్టండి. ఇప్పటికైనా పార్టీ సంస్ధాగతమైన నిర్మాణం చేపట్టండి. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు పార్టీ పదవులు ప్రకటించండి. అధికారంలో వున్నప్పుడు ఎలాగూ పదవులు ఇవ్వలేదు. రాజ్యాంగబద్దమైన పదవులు కల్పించలేదు. ఖాళీగా వుంచారే గాని, క్యాడర్‌కు ఇవ్వలేదు. కొన్ని పదవులు ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ ఇచ్చారు. కాని అవకాశం రాని వాళ్ల గోడు వినలేదు. అయినా వారు పార్టీని వదులుకోవడానికి సిద్దంగా లేదు. నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. కొన్ని జిల్లాలో నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అలాంటి అవకాశవాదులను పెంచి పోషిస్తున్నారని కూడా క్యాడర్‌ గతంలో నెత్తినోరు మొత్తుకొని చెప్పిన వినలేదు. అందుకు పదువుల పంపకంలో ఇప్పటి వరకు అవకాశం రాని వారిని గుర్తించి ఇవ్వండి. సీనియర్లను పరిశీలకులుగా మార్చండి. నాయకత్వ బాధ్యతలు మళ్లీ వారి చేతుల్లో పెట్టకండి. లేకుంటే మళ్లీ వారి వ్యహరశైలి మొదటికే వస్తుంది. నాయకులు పెత్తనం మాని, క్యాడర్‌తో, ప్రజలతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించండి. గతంలో కేసిఆర్‌ తెలుగుదేశంలో వున్న కాలంలో శిక్షణా తరగతులు ఇచ్చేవారు. 2014లో అధికారంలోకి వచ్చాక తొలి నాళ్లులో కొన్ని సార్లు శిక్షణా తరగులు బ్రహ్మాండంగా నిర్వహించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అసలు క్యాడర్‌నే దూరం చేసుకున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాడే వందేళ్ల పాటు చెక్కు చెదరని పార్టీగా ప్రజల్లో వుండేలా ముహూర్తం పెట్టినట్లు గతంలో కేసిఆర్‌ అనేక సార్లు చెప్పారు. కాని పార్టీ పేరు ఇరవైఏళ్లలో మార్చేశారు. మరి బిఆర్‌ఎస్‌ మరో వందేళ్ల పునాదులు వేయండి. అందుకు పార్టీ సంస్ధాగత నిర్మాణంతోనే సాధ్యమౌతుంది. నిజానికి ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఓడిరచలేదు. బిఆర్‌ఎస్‌ నాయకులే పనిగట్టుకొని ఓడిపోయారు. ఇది ముమ్మాటికి నిజం. నూరుపైసల వాస్తవం. ప్రజల ముందుకు వెళ్లడానికి కూడా చాలా మంది నాయకులు నామోషిగా ఫీలయ్యారు. ఇతర నాయకులను కలుపుకొని పోయేందుకు సిద్దపడలేదు. అంతే కాదు వాడి దగ్గరకు నేను వెళ్లాలా? అన్న అహం నింపుకొని చేజేతులా పదవిని చేతి పార్టీలో పెట్టిన వాళ్లున్నారు. అయితే ప్రజల్లో వున్న సానుభూతిని ఇప్పుడే పాడు చేసుకోవద్దు. ప్రభుత్వం తప్పులు చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి. ప్రజలకు కాంగ్రెస్‌ పాలన అర్ధం కావాలి. బిఆర్‌ఎస్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలియాలి. ఇప్పటికే కొంత అర్దమౌతోంది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం క్యాడర్‌ చేసే విధంగా నాయకులు వారిని ప్రోత్సహించాలి. నాయకులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని అంచనా వేసుకుంటూ వుండాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కవ సీట్లు గెలిచేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *