ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ నాయకులు..
రామాయంపేట మార్చి 12 నేటి ధాత్రి (మెదక్)
ఇటీవల అనారోగ్యంతో మరణించిన రామయంపేట మండల లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి భూమయ్య కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ నాయకులకు ఆర్థిక సాయం అందజేశారు. భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి కాంటా రెడ్డి తిరుపతిరెడ్డి రూ.5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీసీ మైస గౌడు, బాలయ్య, మల్లేశం,విజయభాస్కర్ రెడ్డి, కాట్రాల బిక్షపతి, రాజేందర్ గుప్త, మాజీ ఉపసర్పంచ్ స్రవంతి రాజేందర్, బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.