చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి కురుమ పల్లి గ్రామంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో దాదాపు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య ఆయా గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.