
# గిరిజనులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి
# గుండెంగవాయి గుత్తి కోయ గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గుండెెంగ వాయి గుత్తి కోయ గుంపులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూర్ నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిశ్రా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ లతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని , పనులకు వెళ్లే సమయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గుంపు ప్రాంతాలలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గిరిజనులు ఎక్కువగా వినియోగించే చెలిమే త్రాగు నీటిని పరీక్షించారు , నీరు స్వచ్ఛమైనప్పటికీ ఆరోగ్య దృష్ట్యా వేడి చేసి చల్లార్చిన నీటిని సేవించాలని సూచించారు గర్భిణీ స్త్రీలు తమ వివరాలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని, సంబంధిత ఏఎన్ఎం ఆశా వర్కర్స్ సహాయంతో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని , ప్రసవ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సొంత వైద్యం చేయడం తల్లి బిడ్డకు ప్రమాదమని సూచించారు.
గిరిజనుల ఆరోగ్యం విషయంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని తమ పరిధిలోని గుంపు ప్రాంతాలను నిరంతరం ఆశ వర్కర్స్ , ఏఎన్ఎం లు నిరంతరం పర్యవేక్షించాలని ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించడంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు అనంతరం గిరిజనుల జీవన విధానం వారి యొక్క దినచర్య, వేసవికాలంలో అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు గిరిజనులకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అలెం అప్పయ్య వైద్య పరీక్షలు నిర్వహించారు 100 మందికి వివిధ ఆరోగ్య పరీక్షలు 25 మందికి మలేరియా 15 షుగర్ పరీక్షలు చేసామని, గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లో ఆర్డబ్ల్యూఎస్ డి ఈ వెంకటసతీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుభాష్, ఏఈ మోహన్ గ్రిడ్ అధికారి సంధ్యారాణి రోయ్యురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమలత, ఇద్దరు పోలింగ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కమల, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, ఏటూర్ నాగారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.