ట్రై కార్ లోన్ దరఖాస్తులను వెంటనే ఆన్లైన్ చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్ .
మహా ముత్తారం నేటి ధాత్రి.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్ మాట్లాడుతూ
మహా ముత్తారం మండలంలో 2021 2022 సంవత్సరంలో ట్రై కార్స్ లోన్స్ ప్రతి గ్రామపంచాయతీలో ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులని సెలెక్ట్ చేశారు అయినప్పటికీ ప్రతి గ్రామపంచాయతీలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల అన్ని దరఖాస్తులను కాకుండా ఎంపీడీవో ఆఫీసులో కొన్ని మాత్రమే ఆన్లైన్ చేయడం జరిగింది అదేవిధంగా మహాముత్తారానికి సంబంధించిన గ్రామపంచాయతీలో 16 మాత్రమే ఆన్లైన్ చేసి మిగతా వాటిని ఆన్లైన్ చేయకుండా ఎంపీడీవో ఆఫీసులో అలాగే మగ్గిపోతున్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థుల దరఖాస్తుల లిస్టును బ్యాంకుకు అందజేశారు బ్యాంకు వాళ్లు ఎంపీడీవో ఆఫీసులొ ఆన్లైన్ చేయకుండా మేము ఏం చేయలేం అని చెప్తున్నారు ఈ మధ్యన బీసీ బందుకు అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి వెంటనే బీసీ బందు అమలు చేయడం జరుగుతుందన్నారు దళిత బంధు కూడా ఈ మధ్యనే విడుదల చేయడం జరిగిందన్నారు మరి ఆదివాసి గిరిజనులకు సంబంధించిన ట్రైకార్స్ లోన్స్ ఎందుకు ఆన్లైన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు వెంటనే ఎంపీడీవో గారు దీనిపై స్పందించి ట్రై కార్ లోన్ అభ్యర్థుల లిస్ట్ ఆన్లైన్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ఎంపీడీవో ఆఫీస్ ముందు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని సమరశీల పోరాటాలు ఉధృతంగా నిర్వహిస్తానీ ప్రజాసంఘాల నాయకుడు పొలం చిన్న రాజేందర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *