Condolences Paid to Suguna at Ainavolu
మృతురాలి భౌతిక దేహానికి నివాళులు
అనారోగ్యంతో దేవస్థాన డైరెక్టర్ ఆనందం సతీమణి సుగుణ మృతి
పరామర్శించి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
నేటి ధాత్రి అయినవోలు :-
ఐనవోలు మండలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్ బరిగల ఆనందం సతీమణి సుగుణ బుధవారం అనారోగ్యంతో మరణించారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు ఐనవోలు మండల కాంగ్రెస్ నాయకులు గురువారం ఆనందం నివాసానికి వెళ్లి సుగుణ భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కూరి స్వామి వాకిటి చందర్ రెడ్డి స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ ఐనవోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగల భాస్కర్,
ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు సంపత్ రెడ్డి, శ్రీ కట్కూరి విజయకుమార్ యూత్ ప్రెసిడెంట్ తాటికాయల ప్రశాంత్,బరిగల ఏలియా, అనుముల రవీందర్, శ్రీ రమేష్ గౌడ్,కోడి కుమార్ స్వామి, బరిగల ప్రభాకర్ అయినవోలు మండలం యూత్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బరిగల చక్రి ,తదితరులు పాల్గొన్నారు.
