రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలు నేడు హక్కులు మరియు స్వేచ్ఛలను అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకై పోరాడిన మహనీయుడు బాబాసాహెబ్ అని తెలిపారు.ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి అని గుర్తుకు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, బీరం నాగిరెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు, కౌన్సిలర్లు మండల శ్రీదేవి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
