ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి,
దోరేపల్లి లక్ష్మీ రవీందర్,
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
స్వాతంత్ర్య భారత తొలి హోమ్ మంత్రి దేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్దిన సమైక్యత స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని,జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మాజీ మంత్రి వర్యులు మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్చర్ల శాసన సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, జడ్చర్ల మున్సిపల్ పరిది 20 వ వార్డు లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు,ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దొరేపల్లి లక్ష్మీ రవీందర్ ,వార్డు కౌన్సిలర్ శ్రావణి శ్యామ్ ,ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.