కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ చమాన్ అమరవీరుల స్తూపం వద్ద ప్రొఫెసర్ సాయిబాబా కి నివాళులర్పించడం జరిగింది. ఈ నివాళుల కార్యక్రమానికి తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శి సుద్దాల నాగరాజు (టిఏకేఎస్) ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక సాప్నికుడు 90 శాతం అంగవైకల్యం ఉండి కూడా ఉద్యమాల ప్రజా ఉద్యమాలకు దిక్సూచి తొమ్మిది సంవత్సరాలు జైల్లో నిర్బంధించబడి అనేకమైన బాధలు పడుతూ బీజేపీ ప్రభుత్వం అబద్ధం కేసులలో ఇరికించి బెయిల్ కూడా ఇవ్వకుండా తొమ్మిది సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది.అదే కాకుండా అక్కడనే చంపాలని కుట్రలు కూడా చేసింది అని అన్నారు.ఆయన భార్య, కూతురు, సహచరులు చేసిన న్యాయ పోరాట ఫలితం వల్ల ఈ సంవత్సరం విడుదల కావటం జరిగింది.శ్రామిక వర్గ ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన మహా గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ డాక్టర్ జి ఎన్ సాయి బాబా నిన్న రాత్రి 8:30 నిమిషాలకు నిమ్స్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం శ్రామిక వర్గానికి తీరని లోటుగా భావిస్తున్నాము అని పేర్కొన్నారు. ఆయన ఆశలు కొనసాగించాలని పీడిత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మైదం బాబు, శ్యాంసుందర్, మైదం పాణి సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన ఐలయ్య ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాంపల్లి రాజన్ బాబు, ఆకుల కుమారస్వామి, రమేష్,రవి, నలగంటి ప్రేమ్ సాగర్, గజ్జ చందు సోషల్ మీడియా కన్వీనర్ , బెల్లంకొండా కరుణాకర్ఎండి అక్బర్,సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ తదితరులు పాల్గొన్నారు.