శాయంపేట నేటిధాత్రి :
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కాంగ్రెస్ కార్యాలయం నందు ప్రజా గాయకుడు గద్దర్ కొన్ని దశాబ్దాల పాటు తన పాటల ద్వారా అణగారిన వర్గాల వారిని చైతన్యం చేశాడని, ఈరోజు వారు లేకపోవడం తీరని లోటని టీపీసీసీ సభ్యులు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు గద్దర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని నివాళులు అర్పించారు.
అనంతరం జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్, పీపుల్స్ వార్ అనంతరం తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారని గుర్తు చేశారు. పేదింట్లో పుట్టిన గద్దర్ ప్రజల మనిషిగా ఎదిగి అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు అని జీఎస్సార్ కొనియాడారు.
వారు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు.వారి కుటుంబానికి ఆ భగవంతుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని జీఎస్సార్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దూదిపాల బుచ్చిరెడ్డి, మండల ముఖ్య నాయకులు చిందం రవి, మారపెల్లి రాజేందర్, యండి రఫీ, యం.డి హైదర్, బాసాని మార్కండేయ, మారపెల్లి కట్టయ్య, కుక్కల భిక్షపతి, నగులగాని వీరన్న, కుక్కల విష్ణు, యండి రియాజ్ తదితరులు ఉన్నారు.