ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ తాత మధు ఆధ్వర్యంలో
ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి గొప్ప సామాజిక విప్లవకారుడు,సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే 134వ వర్థంతి సందర్భంగా ఖమ్మంలోని తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి తదితర బీఆర్ఎస్ ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,ఉప్పల వెంకట రమణ,బొమ్మెర రాంమూర్తి,బెల్లం వేణు, తోట వీరభద్రం, పగడాల నరేందర్,డోకుపర్తి సుబ్బారావు,బిచ్చాల తిరుమల రావు,ఖమర్,లింగనబోయిన సతీష్,బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పూలే చిత్రపటానికి పూలుజల్లి నివాళులర్పించారు.ఈ సందర్భంగా “అమర్ హై అమర్ హై మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ హై”,”సాధిద్దాం సాధిద్దాం పూలే ఆశయాలు సాధిద్దాం”,”జై తెలంగాణ జైజై తెలంగాణ”అంటూ నినదించారు.