
కార్గిల్ విజయ దివస్ అమరవీరుల స్థూపానికి నివాళులు
బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్
భూపాలపల్లి నేటిధాత్రి
కార్గిల్ విజయ దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు
సయ్యద్ గాలిఫ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పిచి అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో మాజీ సైనికులకు ఆపరేషన్ సింధూర్ లో పాలుగోన్నా సైనికులకు మరియు సైనిక విధులలో ఉన్న వారి కుటుంబ సభ్యులు సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ రవి కిరణ్ హాజరై సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం రవి కిరణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం లో సైనికులను వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం.ఇది భారతదేశం భారత సైన్యం విజయాన్ని గుర్తు చేసుకునే రోజు,1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత సైన్యం విజయం సాధించినా దానికి గుర్తుగా ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో ఈ యుద్ధాన్ని నిర్వహించి శత్రువులను తరిమకొట్టింది. అనంతరం పాకిస్తాన్ సైన్యం లొంగిపోగా భరత్ విజయాన్ని సాధించింది. ఈ యుద్ధం లో 527 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు దేశం ఈరోజు వీర సైనికులను గౌరవిస్తూ,దేశభక్తిని గుర్తు చేస్తూ జరుపుకుంటున్నాం అని అన్నారు.అనంతరం సయ్యద్ గాలిఫ్ మాట్లాడుతు భూపాలపల్లి జిల్లా లోని మాజీ సైనికులు సైనికుల కుటుంబలాకు ఎటువంటి కష్టం వచ్చిన భారతీయ జనతా యూవమోర్చ ముందు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం నాయకులు వంశీ, కిరణ్,బీజేపీ నాయకులు ఊరటి మునెందర్, కోరే సుధాకర్, కోమటి రాజశేఖర్, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.