Ward Member Kathi Sandhya Raju Felicitated by Friends
9 వ వార్డ్ మెంబెర్ కత్తి సంధ్య రాజు కు సన్మానం
నేటిధాత్రి మొగుళ్ళపల్లి:
మండలంలోని రంగాపురం గ్రామ తొమ్మిదవ వార్డ్ సభ్యులు కత్తి సంధ్య రాజు డిసెంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ మెంబెర్ గా విజయం సాధించాగా రాష్ట్ర రాజధాని లో స్థిరపడ్డ తన చిన్ననాటి మిత్రులు సంక్రాతి పండుగకు వారి స్వంత గ్రామానికి వచ్చిన మిత్రులు కత్తి సంధ్య రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. కత్తి సంధ్య రాజు బిఆర్ఎస్ పార్టీ రంగాపురం గ్రామ శాఖ అధ్యక్షులుగా 10 సంవత్సరాలనుండి క్రియాశీలక పాత్ర పోషిస్తూ బిఆర్ఎస్ పార్టీలో తనదైన శైలిలో ముద్ర వేసి గ్రామ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించడమే కాకుండా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి వీరాభిమానిగానే కాకుండా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుల దృష్టిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కత్తి సంధ్య రాజు గ్రామ అభివృద్ధిలో వార్డ్ మెంబెర్ గా నిత్యం ప్రజలతో మమేకమై అభివృద్ధిలో విజయం సాధించాలని స్నేహితులు కత్తి సంధ్య రాజును ప్రశంశించారు. స్నేహితులు, కత్తి అశోక్ నామాని శ్రీనివాస్, కత్తి రమేష్,ఉన్నారు.
