-అమరవీరుల సంస్మరణ
-రెండు నిమిషాల మౌనం
-ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో దేశ స్వాతంత్య్ర ఉద్యమ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది
బోయిని పల్లి సమీకృత మండల కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఘన నివాళి అర్పించారు.
ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, ఎం పి ఓ తిలక్, సీనియర్ అసిస్టెంట్ ఎండి హుస్సేన్ అరిఫ్, జూనియర్ అసిస్టెంట్ గడ్డం శ్రీనివాస్, లు అమరులను స్మరించుకుంటూ 2నిమిషాలు వౌనం పాటించారు.
జాతిపిత, మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ప్రతి ఏటా జనవరి 30 వ తేదీన స్మరించుకుంటూ
నివాళులు అర్పిస్తున్న.
ఈ సందర్భంగా ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీ ఓ తిలక్, లు మాట్లాడుతూ.
మహాత్ముడి గొప్ప ఆలోచనలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సమష్టిగా ప్రయత్నించాలన్నారు.
ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీరులకు నివాళులు. వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతిసారీ గుర్తుచేసుకుంటాం. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో టైపిస్ట్ వంశీకృష్ణారెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి, మండల ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.