కల్వకుర్తి /నేటి ధాత్రి.
మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ స్ఫూర్తి స్థల్ జైపాల్ రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాగంలో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర ప్రజలెప్పుడూ మరిచిపోలేరని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం నిశ్శబ్ద సైనికుడిలా జైపాల్ రెడ్డి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర ఏర్పాటులో.. మట్టి బిడ్డ అని కొనియాడారు. రాజకీయాల్లో నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.