చిట్యాల, నేటి ధాత్రి :
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మకు విప్లవ జోహార్లు అని
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్. అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత 1919లో జన్మించి10 సెప్టెంబర్ 1985లో పరమపదించారు, 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపూరం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు కు నాలుగు సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది పాలకుర్తి కి చెందిన చిట్యాల నరసయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది (అప్పటికి ఆమె వయసు (13) ఏడ్లు) వీరికి ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం చాకలి కులవృత్తి వారికి జీవనాధారం 1940-1944 మధ్యకాలంలో విస్నూర్ లో దేశ్ ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ అగ్రకులాల స్త్రీలు దొరసానులు తమను కూడా దొర అని పిలువకపోతే ఉన్నత కులాలతో పాటు వారి అనుంగు ఉంపు డు కత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృతి అనేక పీడన రూపాలు విరుచుకు పడేవి తమను దొర అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీ మీద తమ భర్తలను ఉసిగొల్పి దగ్గరుండి అవైథ్యం చేయించేవారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరేవ్వాడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని త్వరలో గుండెల్లో బడ బగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది అందులో నాలుగు ఎకరాలు సాగు చేశారు పాలకుర్తి పట్వారి వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది జీడి సోమ నరసయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలుగా పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది పాలకుర్తి పట్వారి పప్పులుడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసు నూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్ర రెడ్డి కి తెలియదు చేశాడు కేసులో అగ్రనాయకు లతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా వచ్చింది ఐలమ్మ కుటుంబాన్ని దాన్యం తమదేనని పంటను కోసుకు రమ్మని వంద మందిని దేశ్ ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరి ని కోసి వరి కట్టలు కట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సకిలం యాదగిరి లు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో అయిలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది రజాకారుల ఉపసేనాధి పతి అయిన దేశ్ ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు ధాన్యాన్ని ధనాన్ని ఎత్తుకెళ్లారు ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్టు వారి ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్రజెండాను వీడలేదు ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్ట గలడు అని తనలో తాను ప్రశ్నించు కొన్నది నీ దొరగాడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో రోకలిబండ చేత బూని గుండాలను తరిమికొట్టింది కాలినడకన వెళ్లి దూరకు సవాలు విసిరింది ఐలమ్మ భూ పోరాటంలో విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10/1985 న అనారోగ్యంతో మరణించింది,
మరోసారి విప్లవ వీర నారి ఐలమ్మ కు జోహార్లు ఐ ఎఫ్ టు యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ ఐసా విద్యార్థిసంఘం జిల్లా ఇన్చార్జ్ శీల పాకనరేష్ రాజు పాల్గొన్నారు