శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్ దంపతులు దర్శించుట సందర్భంగా దేవాలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేష వస్త్రంతో వారి సన్మానించినారు ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ తాను పుట్టినా గ్రామాన్ని మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మత్స్యగిరి స్వామి చాలా మహిమగల దేవుడని సంతోషంగా వ్యక్తం చేశారు