
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో గిరిజన సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన భవన నిర్మాణం కు రూ. 1.15 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. పూర్తి స్థాయి వసతులు అందులో కల్పించినట్టు చెప్పారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయం కోసం రూ. 41 లక్షలు ఇచ్చినట్టు చెప్పారు. గిరిజన విద్యార్థులు కోసం ప్రత్యేకంగా వసతి గృహం నిర్మాణం చేసినట్టు చెప్పారు. ఉన్నత చదువులు చదివే వారికి.. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేవారికి ఇది ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్టంలో తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చి మా తండా లో మా రాజ్యం అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చినట్టు తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల పాఠశాల లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహులు, మాజీ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, రామలక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, పాల సతీష్, ప్రతాప్ నాయక్, రమేష్ నాయక్, కిషన్ పవార్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.