కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినా చల్లా
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు.గురువారం గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామనికి చెందిన బాధవాత వెంకన్న జిల్లా గిరిజన విద్యార్థి ప్రెసిడెంట్,భ్యుక్యా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు,భూక్యా సుమన్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్,అజ్మీరా వీరన్న,అజ్మీరా శ్రీనివాస్,బానోత్ సుమన్, బాధవాత్ బాలరాజు,బనోత్ రాహుల్,తిరుపతి, శ్రీను,విజయ్ యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి నాయకుల మాటలు నమ్మి
యువకులు ఇన్నిరోజులు మోసపోయారాణి మండిపడ్డారు.కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ముందంజలో ఉంటారన్నారు.పార్టీకోసం పని చేసే ప్రతి యువకుడికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరి ఏ ఇతర రాష్ట్రాలలో అమలు కావడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి యువకుడు పార్టీకోసం సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జూలూరి లెనిన్ గౌడ్, భూక్యా రాజు, వీరన్న, రవీందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.