కల్పవృక్ష నారసింహ స్వామి దర్శనం కొరకు వచ్చిన గిరిజన సాధు మహారాజులు……..

భద్రాచలం నేటి దాత్రి

కలి బాధలో బాపే కల్పవృక్ష నారసింహుని దర్శనం మా పూర్వజన్మ సుకృతం…….

మేడారం జాతరకి వెళ్లే ముందు పుడుపులు సమర్పిస్తున్న వైనం…..

భద్రాచలం : గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఉన్న శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామమూర్తికి జగదాంబ మేడారం భద్రకాళి పూజారుల సంఘం తరఫున స్వామివారికి అమ్మవార్లకు పూలు పండ్లు,పట్టు వస్త్రాలను మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి సమర్పించడం జరిగినది. ఎంతోమంది భక్తులు కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు డా.కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష నరసింహమూర్తికి జగదాంబ మేడారం గిరిజన పూజారులు స్వామివారికి పట్టు వస్త్రాలను, అమ్మవారికి చీర సారె ను తీసుకుని మేళతాళాలతో ఊరేగింపు గా రావడం చాలా ఆనందంగా ఉన్నదని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేకమంది కల్పవృక్ష నరసింహస్వామి దర్శనం కొరకు వస్తుంటారని అందులో భాగంగానే ఈరోజు పూజల సంఘం తరఫున రావడం నృసింహ ఆజ్ఞగా భావిస్తున్నామని అన్నారు.అనేక ప్రాంతాల నుండి శివ శక్తులు
మరియు సాధు మహారాజులు ఈ కార్యక్రమానికి రావడం తో కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అంతా నృసింహస్వామి నామంతో మారుమ్రోగిపోయింది.అలానే గిరిజన పూజారులు అమ్మవారికి ఒడిబియ్యం కట్టి వారి సాంప్రదాయంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. అంతేకాకుండా గ్రామాలలో అమ్మవార్లను పూజిస్తూ హైందవ ధర్మ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తూ సమాజ సేవలో తరిస్తున్న గిరిజన పూజారులకు సమాజంలో ఆధారణ లేకుండా పోతుందని అటువంటి వారిని చేరదీసి నృసింహ సేవా వాహిని ద్వారా మున్ముందు ఆదరించి చేరదీసే ప్రయత్నంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తామని మందిరాలలో దూప దీప నైవేద్యముల కొరకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. అలానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గిరిజన పూజారులను ఆలయ మర్యాదలతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో నృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి సాధుమహారాజులు, గిరిజన పూజారుల సంఘం జాతీయ అధ్యక్షులు రాములు నాయక్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రాజు స్వామి,డా.జానకమ్మ మాతాజీ, మరియు జగదాంబ మేడారం భద్రకాళీ పూజారుల సంఘం సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *