కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 16 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అందులో గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ సేవాలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ని కోనరావుపేట మండల గిరిజన నాయకులు,మహిళలు ఘనంగా సన్మానించారు.
సేవాలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.