ఉదారత చాటుకున్న వీర్ల
రామడుగు, నేటిధాత్రి:
75 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఎమ్మార్వో, ఎంపిడిఓ కార్యాలయాల్లో, మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈకార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలలలో గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఈసందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు వివరించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు ఉదారత చాటుకున్నారు. రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన వీర్ల వెంకటేశ్వరరావు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఆట దుస్తులు, షూస్ లను వితరణ చేశారు. ఈసందర్భంగా వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామడుగు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆట దుస్తులు, షూస్ లు అందజేస్తామని ఈసందర్భంగా తెలిపారు. రామడుగు గ్రామానికి చెందిన గాలిపెల్లి నాగేశ్వర్, శ్రీనివాస్ సోదరులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాలకు కంప్యూటర్, మైక్ సెట్ లను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని, విద్యార్థులు చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఈసందర్భంగా తెలియజేశారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తున్న వీర్ల వెంకటేశ్వరరావు, గాలిపెల్లి నాగేశ్వరరావు, శ్రీనివాస్ లను శాలువాతో సత్కరించారు. రామడుగు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలో అధ్యక్షులు సంకిటి తిరుపతిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల జగన్ మోహన్, ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్, జెడ్పిటిసి మార్కొండ లక్ష్మీ క్రిష్టారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.