దోమల వలన రాత్రంతా జాగారాలే…
నయీమ్ నగర్ హనుమకొండ
సాయంత్రం 6 గంటలయిందంటే గజ గజ వణుకుతూ రాత్రంతా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది హానుమకొండ నడిబొడ్డున ఉన్న నయీమ్ నగర్, రాజాజీనగర్, రామ్ నగర్ సమ్మె నగర్ కాలనీ ప్రజలు. ఇటీవల కాలంలో 60 ఫీట్ల రోడ్డు భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసుకుంటూ వచ్చి రాజాజీ నగర్ చివరిలో వదిలేశారు. అక్కడ నుంచి నీరు క్లియర్ గా వెళ్ళిపోకపోవడం వలన నీరు ఎక్కువగా నిలకడగా ఉండడం వలన గుర్రపు డెక్క ఆకు మొలిసి దోమలు స్వేర విహారం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న సమస్య మాత్రం పరిష్కారం కాలేదని కాలనీవాసులు అంటున్నారు. దోమల మందు పిచికారి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దోమ తెరలు, దోమల బ్యాట్స్ అగరవత్తులు, వాడినా దోమల నుండి రక్షణ కరువైందని ఆందోళనకు గురవుతున్నారు. దోమలు కుట్టడం వలన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని కాలనీవాసులు అంటున్నారు. ఈ ప్రాంత కార్పోరేటర్లు కానీ ఎమ్మెల్యే గాని దీన్ని శుభ్రం చేయాలి అన్న ఆలోచన లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతూ సమస్యను కార్పొరేటర్లకు మరియు ఎమ్మెల్యేకు పదేపదే విన్నవించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సమస్య రాలేదని ఇప్పుడు వచ్చిన ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కాలనీకి సంబంధించిన తోట పాపన్న, జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి రణధీర్ రెడ్డి, తండు నాగయ్య, శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, రవీందర్ అధికారులను కోరారు.