
Brotherly Gift of Sarees
తోబుట్టువులుగా భావించి… సోదరునిగా కానుకలు
బతుకమ్మ కోలాటాల మహిళలకు చీరల పంపిణీ: చిలువేరు సమ్మయ్య గౌడ్
మండల కేంద్రంలోని 3 గ్రామాలకు 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన సమ్మి గౌడ్
కేసముద్రం/ నేటి దాత్రి
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కోలాటాలు వేయనున్న మహిళలకు సమ్మి గౌడ్ ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ వ్యవస్థాపకులు,కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ చీరలను అందజేశారు..కేసముద్రం మండలంలోని, ఉప్పరపల్లి,అర్పణ పల్లి, అమీనాపురం గ్రామాలకు చెందిన100 మంది కోలాటం మహిళా సోదరీమణులకు ఎసల్ల సత్యనారాయణ, చాగంటి రాము,పబ్బతి సారంగం,మోడెం రాజుహరిణి,ఎర్రంశెట్టి అశోక్ ల ఆధ్వర్యంలో తమకు ఏకరూప చీరలు కావాలని మండల నాయకులు గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ను అడుగగా ఆడబిడ్డలందరికీ అన్నలా అండగా ఉంటానని వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని చీరలను అందజేశారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆడబిడ్డలందరూ తనకు అక్క చెల్లెళ్ళు అని, వారిని తన తోబుట్టువులుగా భావించి అడగగానే చీరలను అందజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని,నా అనేవారికి ఏ విషయంలోనైనా తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఆనందం లోనే కాదు ఆపదలో కూడా అండగా ఉంటానని తెలిపారు.ఈ సందర్భంగా కోలాటం మహిళలు మాట్లాడుతూ, అన్న మీ గొప్ప మనసుకు మీ ఔన్నత్యానికి మేము కృతజ్ఞతగా ఉంటామని, ఒక అన్నగా, ప్రతి కుటుంబానికి కొడుకులా మీరు మండల కేంద్రంలో అందిస్తున్న సేవలు మరువలేనివని, మీ ఆశయాలకు మేము ఎల్లవేళలా అండగా నిలుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి అశోక్, లక్కాకుల సత్యనారాయణ, ఎసల్ల సత్యనారాయణ,చాగంటి రాము, మోడెం రాజు, పబ్బతి సారంగపాణి, కట్టన్న,విజేందర్ గౌడ్,గంధసిరి వెంకట్,రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.