
"Road Conditions in Shayampet Pose Danger to Travelers"
ఆ రహదారిలో ప్రయాణం.. నరకంతో సమానం
అడుగడుగునా భారీగుంత లు వాటిలో వర్షపు నీళ్ళు
తీవ్ర ఇబ్బందులు పడుతు న్న వాహన చోదకులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి గంగిరేణిగూడెం గోరీకొత్తపల్లి రేగొండ భూపాలపల్లి కాలే శ్వరం వెళ్ళుటకు నర్సంపేట నుండి వయా మల్లంపల్లి ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం గత పది సంవత్సరాల క్రితం అప్పటి శాసనసభ స్పీకర్ మధుసూదననాచారి కాట్రపల్లి నుండి గంగిరేణిగూడెం వరకు ఒక కోటి 16 లక్షలతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను బీటీ రోడ్డు వేసి తీర్చడం జరిగింది.
వామ్మో ఈ రహదారిలో ప్రయాణించా లంటే నరకం కనిపిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు గుల్ల కావడం కాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో కాదు. ప్రజలకు ఈ రహదారి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ప్రయాణం సాగిస్తు న్నారు పాలకుల నిర్లక్ష్యానికి గురై కనీసం కాలి బాటలో కూడా నడవలేని దుస్థితి నెలకొం ది.గత 20 నెలలుగా అధికారం లోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మ లైన గ్రామాలను విస్మరించిం ది.కనీస అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది గ్రామా ల్లో పారిశుద్ధ్యంలోపించి అనేక రోగాలబారిన ప్రజలు పడుతు న్న గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్ఛేనిధులు రాకుండా రాష్టంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని కాట్రపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ అని ఫాగౌస్ విమర్శించాడు.
కావున రాష్ట్ర ప్రభుత్వం త్వర గా 42%బీసీ రిజర్వేషన్ అమ లు చేసి దొంగనాటకాలు ఆడ కుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వారు అన్నారు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీని కుడా గెలుచుకో లేని దుర్భార స్థితిలో ఉందని కాంగ్రేస్ భయపడుతుందని , ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఇప్పటికైనా స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకొని ఈ రహదారిని మర మ్మత్తు చేయించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ ప్రజలు బాబు పెద్ద రమేష్ బాబు సాంబయ్య పాక చిన్న రాజయ్య బాబు చిన్నన్న బాబు తిరుపతి బాబు శ్రీను బైకని సాంబయ్య అరే తిరుపతి పోతరాజ్ ఐలయ్య నూనెటి రమేష్ ఎల్లవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.