మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలో ఖాళీగా ఉన్న సర్ఫేస్ ఎలక్ట్రిషన్, ఫిట్టర్ పోస్టుల భర్తీకీ కౌన్సిలింగ్ ద్వారా సీనియర్టీ ప్రకారం పారదర్శకంగా పోస్టులను భర్తీ చేసినట్లు ఏరియా సింగరేణి అధికారులు తెలిపారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిషన్, ఫిట్టర్ లను సర్ఫేస్ విభాగాలు, ఓపెన్ కాస్ట్ లకు బదిలీ చేయుటకు ఖాళీగా ఉన్న ఐదు ఫిట్టర్, 9 ఎలక్ట్రిషన్ పోస్టుల భర్తీకి మంగళవారం సీనియార్టీ ప్రకారంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్కే ఓసిపి కి ఒక ఫిట్టర్, ఒక ఎలక్ట్రిషన్ లను, కేకే ఓసిపి కి 04ఫిట్టర్లు, ఏరియా వర్క్ షాప్ కు 08ఎలక్ట్రిషియన్లను వారి వారి ఆప్షన్లకు అనుగుణంగా కౌన్సిలింగ్ నిర్వహించి, పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, కేకే ఓసిపి ప్రాజెక్ట్ ఇంజనీర్ సూర్యనారాయణ రాజు, డిజిఎం ఐఇడి రాజన్న, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డివైపిఎం లు సత్యబోస్, ఆసిఫ్, పర్సనల్ విభాగం కార్యాలయ సూపరింటెండెంట్ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.