మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ మెంబర్స్ పద్మశాలీల ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ప్రకటన ప్రెస్ క్లబ్ లో వెల్లడించడం జరిగినది. అనంతరం కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు,24 నెలలు మరియు ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు18 నెలలు ఉచిత భోజన,వసతి మరియు శిక్షణ పని కాలంలో స్టాయిపాయండ్ కూడా , ఇస్తుంది అని మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ సిరిసిల్ల మెంబర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్, గోనే ఎల్లప్ప, కోడం ఆంజనేయులు, చిమ్మని ప్రకాష్, గంట్యాల సురేష్, కొండ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.