Wall Collapse Claims Woman’s Life in Kondaparthi
కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి
హనుమకొండ జిల్లా, ఐనవోలు, నేటిధాత్రి.
ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో బుధవారం జరిగిన దుర్ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. నిన్న ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాత్రి సమయంలో ఓ ఇంటి గోడ కూలి, ఆ ఇంట్లో నిద్రిస్తున్న గద్దల సూరమ్మ (58) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ మరియు రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇళ్లను గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి పురాతన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ సూచించారు.
