Tragic Family Suicide Shocks Hyderabad
విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.
నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రైలుకింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఎంఎంటీఎస్ డౌన్లైన్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా తెలుస్తోంది. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
