
Krishna River Tragedy
విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్పల్లి యువకుడి గల్లంతు
విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది.
విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్(Nagarjuna Sagar) పైలాన్ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. సాగర్ సీఐ శ్రీనునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి(Kukatpally)కి చెందిన జ్ఞానేందర్, సుమన్, మణికంఠ, వెంకటేష్, హర్షవర్ధన్, చాణుక్య ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సాగర్ సందర్శన నిమిత్తం మంగళవారం రెండు ద్విచక్రవాహనాలపై సాగర్‌కు చేరుకున్నారు. ప్రధాన డ్యామ్‌కు దిగువన ఉన్న పుష్కర ఘాట్ వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.