
వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివంగత బాలకిష్టయ్య విగ్రహం దగ్గర రోడ్ చిన్నగా ఉన్నది ఈరోడ్ లో బారి వాహనాలు లారీలు ఇతర రాష్ట్రాల లారీలు రోడ్డుపై నిలబెట్టి సరుకులు దింపడంవల్ల బాటసారులకు ప్రజలకు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసెల్ నెంబర్ 83 281 58 949 ఆందోళన వ్యక్తం చేశారు . భారీ వాహనాలు కమాన్ చౌరస్తాలో రోడ్డుపై ఆపడం వల్ల కమాన్ చౌరస్తా దివంగత మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణయ్య విగ్రహం నుండి ఇందిరా పార్క్ వరకు రోడ్డు జామ్ అవుతుందని అదేవిధంగా మజీద్ రోడ్డు డాక్టర్ బాలకృష్ణయ్య షాపింగ్ కాంప్లెక్స్ వరకు రోడ్డు జామ్ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .గతంలో ట్రాన్స్పోర్ట్ లోడింగ్ లారీలు ఇతర వాహనాలు ఉదయం ఏడు గంటల వరకే అన్లోడింగ్ చేసేవారని ఆ తర్వాత వాహనాలు రోడ్డుపై నిలిపి సరుకులు దింపడం పోలీసులు నిషేధించారని ఆయన గుర్తు చేశారు . ప్రస్తుతం వనపర్తి లో ఆ పరిస్థితి లేదని వెంటనే పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని రోడ్లపై ట్రాన్స్పోర్ట్ వాహనాలు భారీ వాహనాలు ఇతర రాష్ట్రాల వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఖాదర్ పోలీసులకు ఒకప్రకటనలో విజ్ఞప్తి చేశారు