– తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు చోటు కల్పించాలి
– బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోత్ సురేష్ నాయక్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో బంజారా సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి మీడియా సమావేశంలో బంజారా సంఘం నాయకులతో కలిసి సురేష్ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఐక్యతలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బంజారా సోదరులు జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు సీత్లా భవాని వేడుకలు నిర్వహిస్తూ బంజారాల ఐక్యతను చాటుకున్నామన్నారు.
అలాగే ఈ సంవత్సరం కూడా ఈనెల జూలై 9 మంగళవారం అందరం కలిసి నిర్వహించుకుందామని పిలుపునివ్వడం జరిగిందన్నారు. అంతే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి బంజారాల మద్దతు సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది కానీ మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం, భవిష్యత్తులో మంత్రి విస్తరణలో బంజారాలకు చోటు కల్పించాలని కోరడమైనది.
ఇట్టి కార్యక్రమంలో బంజారా సంఘం మీడియా అధ్యక్షులు రాజు నాయక్, సీతా నాయక్, ప్రభు నాయక్, కళ్యాణ్ నాయక్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దేవయ్య నాయక్, రాము నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.