వేములవాడ నేటి ధాత్రి
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ల సంఘం సభ్యులు 30మంది బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం భూమయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మారుపాక బక్కయ్య, శ్రీకాంత్, గంగాధర్, సతీష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.