ఏబీన్ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలు మానుకో
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ హెచ్చరిక
నేటిదాత్రి చర్ల
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఎండి రాధాకృష్ణను తీవ్రంగా హెచ్చరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్
తెలంగాణ ప్రజలు అత్యంత గౌరవంతో చూసే ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పై ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండి రాధాకృష్ణ చేసిన అనూహ్య అవగాహనలేని వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి వ్యక్తిగత దూషణలు అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే వ్యాఖ్యలు జర్నలిజం కాదు అది పక్షపాత ప్రచారం మాత్రమే ప్రజా సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన భట్టి విక్రమార్క ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు
ఏబీఎన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం వెంటనే స్పందించి రాధాకృష్ణ వ్యాఖ్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తగిన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నామని తెలిపారు మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నాం కానీ స్వేచ్ఛ పేరుతో విష ప్రచారం అనుమతించబోమని స్పష్టం చేస్తున్నామని అన్నారు
