గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్
నేటిదాత్రి చర్ల
పోరిక బలరాం నాయక్ మరియు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గిరిజన గ్రామాలైన కుర్నపల్లి పులిగుండాల వీరాపురం కొండేవాయి తదితర గ్రామాల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పనిచేస్తోందని గిరిజన గ్రామాల అభివృద్ధికి స్పష్టమైన దృష్టితో పథకాలను అమలు చేస్తోందని ప్రశంసించారు రహదారులు తాగునీరు విద్య వైద్య సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల రూపురేఖలను మార్చబోతున్నాయని తెలిపారు
గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నల్లపు దుర్గాప్రసాద్ అన్నారు ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను గుర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రతి గ్రామానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం పార్టీ నాయకులు కలిసి పని చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు
