TPCC Delegate Sujith Rao Birthday Celebrations in Metpally
ఘనంగా టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు జన్మదిన వేడుకలు
మెట్ పల్లి నేటి ధాత్రి
టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు జన్మదినం సందర్భంగా మెట్ పల్లి పట్టణం లో కాంగ్రెస్ కార్యాలయం లో ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ,ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కోరుట్ల నియోజకవర్గంలో అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్ఓసీ చెక్కులు అందించడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డులు, పట్టణాలు ఇలా అన్ని ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారని అన్నారు. నియోజవర్గంలో అపరిష్కృత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు అన్ని రకాల సహకారం అందిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి తాము సైతం భాగస్వాములు అవుతుండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ములచిన్నారెడ్డి,పాతధాంర
జ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేశ్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, మామిడి రాజశేఖర్,ఎండి జాఫర్, మొగిలి రాజేందర్,బైండ్ల శ్రీకాంత్, కోరే రాజ్ కుమార్,అయ్యప స్వాములు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
