భద్రాచలం నేటి దాత్రి
భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రధాన రహదారి లో ఒక దగ్గర భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది.
చాలా రోజుల నుంచి గుంతలు ఏర్పడి ప్రయాణికులు వాహనాలు గుంతలలో పడి ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గుంతలను గమనించిన టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి ఎలాగైనా గుంతలను పూడిపించాలని నిర్ణయించుకున్నారు.
తమ సొంత ఖర్చులతో సిమెంట్, గ్రావెల్, ఇసుక, తెప్పించి ఈ రోజు గుంతలను పూడ్పిపించారు.
వాహనదారుల ఇబ్బందులను గుర్తించి గుంతలను పూడిపించిన ఎస్సై మేడంకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.