Heavy Rain Paralyzes Life in Zaheerabad
జహీరాబాద్లో కుండపోత వర్షం, జనజీవనం స్తంభించింది
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అకాల వర్షం పట్టణవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.
