
ట్రెండీ వేర్లో టాలీవుడ్ హీరోయిన్..
మహానటి కీర్తి సురేష్ (Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్'(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’ (Dasara), ‘మహానటి’ (Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే రీసెంట్గా ‘బేబీ జాన్’ (Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది.
అయితే తాజాగా తాను నటించిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిన్నది సర్పంచ్ స్వాగ్ అంటూ కొన్ని ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో బైన డెనిన్ షర్ట్ లాంటి బ్లౌజ్ వేసుకుని, కింద కాటన్ చీర కట్టుకుంది. జుట్టు విరబోసుకొని మల్లెపూలు తగిలించుకుంది. మెడలో చేతిలో చాలా గాజులు, చైన్లు వేసుకుని డిఫెరెంట్‌గా కనిపించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారగా.. అబ్బే ఏం బాగోలేవు అని, నీ ఫ్యాషన్ తగలెయ్య అని కామెంట్స్ చేస్తున్నారు.