నేటి యువత గంజాయి, మారకద్రవ్యాలకు బానిస కావొద్దు.

నేటి యువత గంజాయి, మారకద్రవ్యాలకు బానిస కావొద్దు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం నాడు ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన సదస్సును నిర్వహించారు . టాస్క్ఎస్సై రామ్లాల్ వారి టీం తో సహా మారకద్రవ్యాలపై యువత అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా గంజాయి మొక్కలను పెంచినట్టయితే వారికి సమాచారం అందించాలని యువత బానిసై ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారని ప్రజలు వీటి గురించి తెలుసుకొని వారి యొక్క పిల్లలని కాపాడుకోవాలని ఈ గంజాయిని వాడడం ద్వారా నరాల్లోకి రక్తంలో కలిసి ఊపిరిదితులు చెడిపోవడం, ఈ మత్తు దాదాపు 30 గంటలు ఉంటుందని దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారో వారికే తెలియదని మద్యపానం కన్నా హానికరమని తెలిపారు. ఎవరైనా ఈ మొక్కలను పెంచిన, గంజాయిని అమ్మిన వారికి సమాచారం అందించాలని లేదా 100కు డయల్ చేసి సమాచారాన్ని అందించాలని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version