ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య*
చిట్యాల, నేటిధాత్రి :
సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా లో మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన* రోజును పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య మాట్లాడుతూ హింస వలన ప్రాణాలు కోల్పోతాం అహింస వలన ప్రేమను మనుషులు స్వేచ్ఛగా జీవించవచ్చని చెప్పిందే బౌద్ధం కనుక “అశోక చక్రవర్తి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెప్పారు. మహా బోదిసత్వ గౌతమా బుద్ధుని బోధనలు సూచనలు నచ్చి అశోక చక్రవర్తి 5268 సంవత్సరాల క్రితం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న నాగాపూర్ లో 5 లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారని* తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఈ బౌద్ధం చాలా ఉపయోగపడుతుందన్నారు. మొట్టమొదటి సారిగా అశోక చక్రవర్తి హింసను వదిలి అహింస మార్గాన్ని ఎంచుకోని బౌద్ధాన్ని స్వీకరించాడని తెలిపారు. చెడును వదిలి మంచిని జీవితంలోకి తీసుకురావడమే దమ్ము చక్ర పరివర్తన* అంటారు. ఈ మతంలో మారణహోమాలు యుద్ధాలు జరుగవని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి కుల మతాలకు అతీతంగా అందరినీ చైతన్య వంతులను చేస్తు ఆ మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుక రావడానికి నేటి యువత పాటుపడాలని అన్నారూ,ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకుడు కనకం తిరుపతి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకల రాయకొంరు నాయకులు దబ్బెట రవి ముసాపురి నరేష్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు