నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి :
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే నేటి గణతంత్ర దినోత్సవ సంబరాలు అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ముందుగా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన ఎమ్మెల్యే దొంతి మహాయులకు నివాళులర్పించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను త్యాగమూర్తులను గుర్తు తెచ్చుకు తెచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి పేర్కొన్నారు.రేవంత్ ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు, 8 రోజుల పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ఇప్పటికే పకడ్బందీగా అమలు చేస్తుందని, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మిగతా పథకాలైన రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, చేయూత పథకాల ద్వారా ఉపాధి అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మహాలక్ష్మి పథకం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్.టీ.సీ. బస్సుల్లో జీరో టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. మిగితా సంక్షేమ పథకాలు త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు వివరించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపెళ్ళి రవీందర్ రావు,పిసిసి సభ్యులు పెండెం రామానంద్,పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్స్ బత్తిని రాజేందర్, వేముల సాంబయ్య గౌడ్,పెండెం లక్ష్మి రామానంద్,కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ఎలకంటి విజయకుమార్, పెండెం లక్ష్మి, ములుకల వినోద, ఓర్సు అంజలి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,తుమ్మలపెల్లి సందీప్,డాన్ సూరి (సురేష్,),తదితరులు పాల్గొన్నారు.