
Workshop Program
నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):
తెలంగాణ ప్రభుత్వం సాహిత్య అకాడమీతో కలిసి యువ కథకుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కథల కార్యశాల తేదీ 27 మే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రవీంద్రభారతి మినీ హాల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ కథల కార్యశాలలో ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ “కథలు ఎలా రాయాలి” అనే అంశంపై యువ కథకులకు రోజంతా శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కొత్తగా రాస్తున్న యువ రచయితలకోసమే నిర్వహిస్తున్న కార్యశాల అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి పేర్కొన్నారు.పెద్దింటి ఇప్పటికే యూనివర్సిటీలలో, డిగ్రీ కళాశాలలలో అనేక కథల కార్యశాలలు నిర్వహించారు. ఆయన రచించిన కథలు, నవలలు పలు యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు పాటలు మాటలు రాస్తున్నారు.