హసన్ పర్తి/ నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం తహశీల్దార్ కార్యాలయంలో నేటి ధాత్రి దినపత్రిక క్యాలెండర్ ను మండల తహసీల్దార్ & జాయింట్ రిజిస్టర్ చల్ల ప్రసాద్ ఆవిష్కరించారు. ఆనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల యం పి డి ఓ మాట్లాడుతు మండల కార్యాలయ సిబ్బంది తో ప్రతిజ్ఞ చేశారు భారత దేశ పౌరుల మైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయమును స్వేచ్చాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండ ప్రజా ఎన్నికల్లో నిర్భయంగా, ఇందుమూలంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అని తెలిపారు ఈ క్రయక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ రహీం సీనియర్ అసిస్టెంట్ రాణి రెవెన్యూ అధికారులు కుమార్, ఫజిల్ తదితరులు పాల్గొన్నారు