
AISF District Treasurer Laddunoori Vishnu
నేటి విద్యాసంస్థల బందు విజయవంతం
హాస్టల్ విద్యార్థులకు మేస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు
జమ్మికుంట (నేటిధాత్రి)
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
జమ్మికుంట పట్టణ కేంద్రంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్ధునూరి విష్ణు మాట్లాడుతూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలలో నెలకొన్న సమస్యలతో పాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న పిలుపునిచ్చిన విద్యాసంస్థల బందు విజయవంతం అయిందని అన్నారు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
బకాయి ఉన్న 8 వేలకోట్ల విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి కావున హాస్టల్ విద్యార్థులకు మేస్చార్జులు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, ఆర్టీసీ లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు MD అజీమ్,ఆర్ అవినాష్, జె శేసి, ఇ గణేష్, పి వికాస్ తదితరులు పాల్గొన్నారు