రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
విద్యార్థులు బాగా చదువుకొని విద్యార్థి జీవితం మంచిగా మలుచుకుంటే వారి జీవితం అంతా గోల్డెన్ లైఫ్ అవుతుదని, నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులకు మంచి చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి ఉండాలని మెదక్ జిల్లా డిఐఈఓ k. సత్యనారాయణ అన్నారు. వ్యక్తికి గుర్తింపు రావాలంటే చదువుతోనే వస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం చురుకుగా పాల్గొనాలని ఆయన అన్నారు. విద్యార్థి జీవితం మళ్ళీ రాదని అవకాశాన్ని వినియోగించుకోవాలని తమ జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు.మెదక్ జిల్లా రామాయంపేటలో స్నేహ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ లయన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్నేహ విద్యాసంస్థలలో అడ్మిషన్ అయిన జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ల నుండి సీనియర్లు క్రమశిక్షణను నేర్చుకొని తెలియని విషయాలు తెలుసుకుని చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వక్తలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శంకర్, DIEO. K. సత్యనారాయణ ఆయా కళాశాల ప్రిన్సిపాల్లు లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు.