
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ పాలకవర్గ సభ్యుల పదవీకాలం పూర్తి అగుచున్న సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ మండల సర్వ సభ్య సమావేశము ఏర్పాటు చేయనైనది ఇట్టి కార్యక్రమంలో గండ్ర సత్యనారాయణరావు శాసన సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఈ సమావేశంనకు సన్మాన గ్రహీతలైన మండల పరిషత్ అధ్యక్షులు మండల ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించనైనది
కావున మండల ప్రత్యేక అధికారి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులు పంచాయితీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరనైనది మండల పరిషత్ అభివృద్ధి అధికారి